Do you know what young women search alone on Google?
mictv telugu

యువతులు ఒంటరిగా గూగుల్‌లో ఏం వెతుకుతారో తెలుసా?

August 31, 2022

Do you know what young women search alone on Google?

ప్రస్తుతమంతా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కావాల్సిన సమాచారం క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. సమస్య, సమాధానం ఏదైనా గూగుల్ తల్లి ఇట్టే చెప్పేస్తుంది. ప్రతీ ఒక్కరు తమ అవసరాలకు తగ్గట్టు సెర్చ్ ఇంజన్‌లో సమాచారం కోసం ప్రయత్నిస్తారు.

అలాగే ప్రతీఏటా ఎవరెవరు, దేని కోసం వెతికారో గూగుల్ ఓ నివేదికను వెల్లడిస్తుంది. ఈ ఏడాది విడుదలైన నివేదికలో అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు వేటి కోసం వెతుకుతారో తేల్చి చెప్పేసింది. మనదేశంలో సుమారు 15 కోట్ల మంది నెట్ వినియోగదారులు ఉండగా, అందులో మహిళల వాటా సుమారు 40 శాతం ఉంటుంది. నివేదిక ప్రకారం అమ్మాయిలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఉద్యోగం, కెరీర్‌కు సంబంధించిన సమాచారం కోసం ఎక్కువగా వెతికారంట. తర్వాత స్థానం చదువు గురించి. ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడతారంట. వీటి తర్వాత ఆన్ లైన్ షాపింగ్, బ్యూటీ టిప్స్, హోం రెమెడీస్, డెకరేషన్స్, ఫ్యాషన్ సంబంధిత సమాచారం కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని గూగుల్ నివేదిక తెలిపింది.