మనదేశంలో డబ్బున్నవారు బోలేడు ఉన్నారు. పేదవారికంటే డబ్బున్నవారే ఎక్కువా ఉన్నారని..ఇటీవలే ఓ సర్వే కూడా వెల్లడించింది. అయితే డబ్బున్నవారు డబ్బును ఎక్కుడ ఇన్వెస్ట్ చేస్తారు. ఈ సందేహం చాలామందిలో వచ్చి ఉండవచ్చు. ఇంకొంత మంది ఈ విషయాన్ని తెలుసుకోవానుకుంటారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ సర్వేను పరిశీలిస్తే..అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం ఈక్విటీలే అని తెలుస్తోంది. ధనవంతులు 34శాతం పెట్టుబడులను ఈక్విటీలకే కేటాయిస్తారట.
ఈక్విటీల తర్వాత రియల్ ఎస్టేట్‌లో 25శాతం, బాండ్ల రూపంలో 16శాతం, వెంచర్ క్యాపిటల్ రూపంలో 10శాతం, బంగారంలో 6వాతం, ఇతర ఇష్టమైన వస్తువులపై 4శాతం చొప్పున పెట్టుబడులు పెడుతున్నారని తెలిసింది. నైట్ ఫ్రాంక్ సంస్థ వరల్డ్ వైడ్ గా నిర్వహించి ద వెల్త్ రిపోర్టు అవుట్‌లుక్ 2023 పేరుతో రిలీజ్ చేసింది.
సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
1. కొన్ని అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 88శాతం మంది భారతీయ ధనవంతుల సంపద 2022లోనే ఎక్కువగా వ్రుద్ధి చెందింది.
2. గతేడాది 10శాతానికి పైగా సంపద పెరిగినట్లుగా 35శాతం మంది ధనవంతులు వెల్లడించారు.
3. ఈ ఏడాది కూడా తమ సంపద వ్రుద్ధి చెందుతుందని..53శాతం మంది ధనవంతులు అభిప్రాయపడుతున్నారు.
4. 47శాతం మంది ధనవంతుల సంపద 10శాతానికి పైగా పెరగవచ్చని అంచనా.
4. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల కంటే ధనవంతులే ఈక్వీటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
5. ఇక మన దేశంలో ఒక్కొక్కరు కనీసం 5 నివాస ఆస్తులను కలిగి ఉన్నారు.
6. 2022లో 14శాతం మంది ధనవంతులు ఇళ్లను కొనుగోలు చేయగా..2023లో 10శాతం మంది కొనుగోలు చేస్తారని సర్వే అంచనా వేసింది.
7. భారత్ కంటే యూకే, యూఏఈ, యూఎస్ఏ లోఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్య ప్రాంతాలుగా ఉన్నాయి.