అమెరికా అనగానే అందరికీ గుర్తొచ్చేది సాఫ్ట్ వేర్ జాబ్స్ మాత్రమే. బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్ళి ఐటీ కంపెనీలో వేల డాలర్లు సంపాదించాలనే ఇది ఒక కల. అందుకు తగ్గట్టే ప్రతియేటా వేలాది మంది టెక్కీలు అమెరికా వెళ్తున్నారు. నేడు అనేక అమెరికన్ ఐటి కంపెనీల్లో భారతీయులదే పై చేయి. అయితే అమెరికా వెళ్లాలంటే కేవలం సాఫ్ట్ వేర్ నిపుణులకు మాత్రమే చాన్స్ ఉందా.. ఇతరులకు లేదా అనే అనుమానం కలుగవచ్చు. నిజానికి అమెరికాలో అనేక రంగాల్లో నైపుణ్యం కలిగిన పనివాళ్ళ కొరత చాలా ఉంది.
ప్రస్తుతం అమెరికాలో ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ వంటి పని చేసే వారికి చాలా డిమాండ్ ఉంది . అక్కడ ఈ రంగాలలో పనిచేసే వ్యక్తులు సులభంగా మంచి సంపాదన పొందుతున్నారు. ఈ రోజుల్లో అమెరికాలో ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ వంటి ఉద్యోగాల్లో పనిచేసే వారి కొరత చాలా ఎక్కువ. సాధారణంగా అమెరికన్ ప్రజలు ఈ పనులు చేయడానికి ఇష్టపడరు. తరతరాలుగా ఈ పనులు చేస్తున్న వారి పిల్లలు తమ తల్లిదండ్రులు చేసిన పనిని అడాప్ట్ చేసుకోవడం లేదు. అందుకే ఇలాంటి పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.
40 నుంచి 60 లక్షల వరకు సంపాదించవచ్చని ఆఫర్:
2021 సంవత్సరంలో ఈ ఉద్యోగాల కోసం రూ. 40 నుండి 60 లక్షల వార్షిక ప్యాకేజీని పలు కంపెనీలు ఆఫర్ చేశాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఆన్ లైన్ రిక్రూట్ ఫ్లాట్ ఫాం హ్యాండ్ షేక్ ప్రకారం చూసినట్లయితే…2020తో పోల్చితే 2022లో ప్లంబింగ్, బిల్డింగ్, ఎలక్ట్రికల్ వంటి ఉద్యోగాలను కోరుకునే యువత 49శాతం భారీ క్షీణత ఉందని పేర్కొంది.
ఆటోమోటివ్ టెక్నీషియన్, టూల్ ఇన్స్టాలర్, రెస్పిరేటరీ డాక్టర్ వంటి పోస్టుల కోసం, 2020లో సగటున 10 దరఖాస్తులు వచ్చాయి, అది 2022లో 5కి తగ్గింది. ఒక్కో ఉద్యోగానికి 19 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కంపెనీ చీఫ్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ ఆఫీసర్ క్రిస్టీన్ క్రుజ్వెర్గారా తెలిపారు. కాగా కొత్త టెక్నికల్ పోస్టులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
క్రుజ్వెర్గారా ఇంకా మాట్లాడుతూ, చాలా కాలంగా తమ పిల్లలు ఈ నైపుణ్యాలు నేర్చుకోవడానికి శిక్షణ అందిస్తామని చెప్పిన ఎవరూ ముందుకు రావడం లేదని తెలపడం విశేషం. పిల్లలు ఇప్పుడు ఈ పనులను దాటవేస్తూ ఆఫీస్ లోనే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. విశేషమేమిటంటే, US ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2023లో ఈ వ్యాపారాలలో భారీ తగ్గింపు గురించి హెచ్చరించింది. యుఎస్‌లో ఈ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కావున మన దేశం లో ఈ పనులు చేసే వారికి అమెరికా రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలికే అవకాశం ఉంది.