రుచికరమై, ఇష్టమైన ఆహారం ఉంటే కొంచెం ఎక్కువగా తింటాం. కడుపు నిండిపోయినా కాస్త ఎక్కువగా తినేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ కడుపు నిండా తిన్నా తర్వాత కూడా మళ్లీ మళ్లీ తినాలనే కోరిక ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు. దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే శరీరానికి శక్తి అవసరం కాబట్టి ఆకలి వేసినప్పుడల్లా తింటుంటాం. కానీ తిన్న తర్వాత కూడా మళ్లీ ఆకలిగా అనిపిస్తే..దాని వెనక పెద్ద కారణమే ఉండవచ్చు. అనేక సందర్బాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. కాబట్టి మీరు అవసరమైన దానికంటే ఎక్కువగా తిన్నట్లయితే…ఖచ్చితంగా ఒకసారి వైద్యుడిని సంప్రదించాల్సిందే.
మధుమేహం:
షుగర్ పేషంట్ల శరీరంలోని కణాల్లోకి గ్లూకోజ్ ప్రవేశిస్తుందా లేదా అనేది తెలియదు. వారి శరీరంలో శక్తి సృష్టించబడదు. మూత్రం ద్వారా గ్లూకోజ్ శరీరం నుంచి బయటకు వస్తుంది. దీంతో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కూడా మీకు తిన్న తర్వాత తినాలనే కోరిక కలుగుతుంది.
నిద్రలేకపోవడం:
మనిషికి దాదాపు 8గంటల నిద్ర తప్పనిసరి. శరీరానికి కావాల్సినంత విశ్రాంతి ఇచ్చినప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రలేమి లేదా ప్రశాంతంగా నిద్రపోకపోతే…అది మీ ఆకలి హీర్మోన్లను ప్రభావితం చేస్తుంది. మీకు మరింత ఆకలిని కలిగిస్తుంది. ఈకారణం వల్ల మీరు అతిగా తినడం ప్రారంభిస్తారు.
ఒత్తిడి:
చాలామంది ఒత్తిడికి లోనైప్పుడు ఎక్కువగా ఆహారం తినేందుకు ప్రయత్నిస్తుంటారు. మీ శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుడంతో…ఈ హార్మోన్ ఆకలిని పెంచుతుంది.
ఆహారం:
మీ ఆహారంల కేవలం జంక్ ఫుడ్ లేదా చెడు ఆహారాలు ఉంటే…అవి మీ శరీరానికి ఎలాంటి శక్తిని ఇవ్వవు. అప్పుడు మీకు ఇంకా ఎక్కువగా ఆకలి అనిపిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆకలి మళ్లీ మళ్లీ వేయదు.
అధికంగా మందులు వాడటం:
కొన్ని మందులు సాధారణం కంటే ఎక్కువగా తినేలా చేస్తుంటాయి. అలెర్జీలకు చికిత్స చేసేందుకు ఉపయోగించే యాంటిహిస్టామైన్స్ ఆకలిని కలిగిస్తాయి. స్టెరాయిడ్స్, కొన్ని షుగర్ మందులు, యాంటి సైకోటిక్ మందులు కూడా ఆకలిని పెంచుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.