Do you want to give Rakhi wishes to AP CM..then do this
mictv telugu

సీఎంకు విషెష్‌ చెప్పాలని ఉందా..అయితే, ఇలా చేయండి

August 12, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ జగన్ మోహన్ రెడ్డి రాఖీ పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. అయితే, ఆయనకు రాఖీ విషెప్ చెప్పాలని అనుకుంటున్నవారికోసం ప్రభుత్వం ఓ సదుపాయాన్ని ముందుకు తీసుకొచ్చింది. ”జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి. ప్రతి మహిళ..మొదటగా మీ ఫోన్‌లో వీడియోను రికార్డును చేసి, రికార్డు చేసిన మీ వీడియోను వాట్సాప్‌ స్టేటస్‌లో కానీ, ఇతర సోషల్‌ మీడియా పేజీల్లో కానీ అప్‌లోడ్‌ చేయండి. లేదా 7890689927 నెంబర్‌కు రికార్డు చేసిన వీడియోను పంపండి” అంటూ అధికారులు తెలియజేశారు.

 

ఈ విషెప్‌కు సంబంధించిన ఓ కరపత్రాన్ని కూడా అధికారులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అందులో ‘ఈ రాఖీ పండుగ రోజు మీ ప్రియతమ నేత జగనన్నకు శుభాకాంక్షలు తెలుపండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3తోపాటు ఫోన్ నెంబర్‌ను కూడా ఉంది’. మరి ఎందుకు ఆలస్యం వెంటనే జగన్ మోహన్ రెడ్డికి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేయండి.