కరోనా ఆస్పత్రిలోనే డాక్టర్, నర్సు పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఆస్పత్రిలోనే డాక్టర్, నర్సు పెళ్లి

May 29, 2020

 

London

కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. అయితే ఓ జంట మాత్రం పెళ్లి చేసుకున్నారు. ప్రేమలో పడ్డ ఓ డాక్టర్, నర్సు జంట కరోనా రోగులకు సేవలందిస్తున్న ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన యూకేలో చోటు చేసుకుంది. 34 ఏళ్ల జాన్ టిప్పింగ్, 30 ఏళ్ల అన్నలన్ నవరత్నం.. లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో విధులు నిర్వరిస్తున్నారు. కరోనా రోగులకు నిత్యం వారు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఒప్పుకున్నారు. అందరి సమక్షంలో ఆగస్టులో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. 

అయితే కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వారు తమ పెళ్లిని వాయిదా వేసుకోవద్దని నిర్ణయించుకున్నారు. సాదాసీదాగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోనే ఏప్రిల్‌లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లిని వారి కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. కాగా, వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆసుపత్రి యాజమాన్యం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు.