గాంధీలో డాక్టర్స్ ఫ్యామిలీ..అందరూ కరోనా పోరులోనే - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీలో డాక్టర్స్ ఫ్యామిలీ..అందరూ కరోనా పోరులోనే

May 5, 2020

Doctor Family In Gandhi Hospital

కరోనా రక్కసిని ధీటుగా ఎదుర్కొనేందుకు డాక్టర్లు ఎనలేని కృషి చేస్తున్నారు. కంటికి కనిపించని వైరస్‌తో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. రోజుల తరబడి సేవలు చేస్తూ ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలోనూ ఎంతో మంది వైద్యులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తమ వంతుగా సేవ అందిస్తుండటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

భార్య, భర్త, కొడుకు ముగ్గురూ గాంధీ ఆస్పత్రిలోనే కరోనా డ్యూటీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతిగా పని చేస్తున్న ప్రొఫెసర్‌ సుబోధ్‌కుమార్, గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్న ఆయన భార్య డాక్టర్‌ కృష్ణవేణి వీళ్ల కొడుకు శుశ్రుత్‌ ఇప్పుడు కరోనా వారియర్స్‌గా ఉన్నారు. శుశ్రుత్ గాంధీ మెడికల్‌ కాలేజీలోనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అక్కడే హౌజ్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వైరస్‌ను నియంత్రించేందుకు వీరంతా పని చేస్తున్నారు. ఈ ఫ్యామిలి గురించి తెలిసిన వారంతా వారి సేవలకు హాట్సాఫ్ చెబుతున్నారు. ఇలా ప్రజా సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆ ఫ్యామిలి చెప్పడం విశేషం.