డాక్టర్‌నే కోమాలకు పంపిన దవాఖాన - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్‌నే కోమాలకు పంపిన దవాఖాన

November 2, 2017

డాక్టర్‌గా పనిచేస్తున్న దావఖానలోనే ఓ డాక్టర్ కోమాలోకి వెళ్లిన సంఘటన బేగంపేటలో జరిగింది. హైద్రాబాద్‌లోని బేగంపేటలోని వివేకానంద దవాఖానలో బండ్లగూడకు చెందిన నిహారిక హోమియోపతి వైద్యురాలుగా పనిచేస్తోంది.

అయితే అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య రావడంతో, తాను పనిచేసే ఆసుపత్రిలోనే చేరింది. ఆషరేషన్ సమయంలో మత్తుకోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది,  దీనితో ఆమె కోమాలోకి వెళ్లింది. వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేసిన నిహారిక కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కేర్ ఆసుపత్రికి తరలించారు. తమ కూతురు కోమాలోకి వెళ్లడానికి కారణమైన వివేకానంద ఆసుపత్రి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు బందువులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పనిచేసిన దవాఖానలోనే తనకు ఇలాంటి సంఘటన ఎదురవుతుందని, ఆ వైద్యురాలు కలలో కూడా ఊహించి ఉండదు కావచ్చు.