ప్రాణాలు కాపాడిన డాక్టర్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణాలు కాపాడిన డాక్టర్ అరెస్ట్

September 2, 2017

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ బర్డ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పసికందుల ప్రాణాలను కాపాడిన డాక్టర్ కఫీల్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు..!  ఇటీవల ఆ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల వందమందికిపైగా నవజాత శిశువులు కన్నుమూయడం తెలిసిందే. కఫీల్ నానా అగచాట్లూ పడి ఇతర ఆస్పత్రుల నుంచి, స్నేహితులైన డాక్టర్ల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చారు.

అవి కూడా సరిపోకపోవడంతో పిల్లలు చనిపోయారు. కఫీల్ వల్లే తమ పిల్లలు బతికారని పలువురు తల్లిదండ్రులు ఆయన్ను కొనియాడారు. అయితే పోలీసులు మాత్రం  కేసులో ఆయనను నిందితుడిగా పేర్కొని కేసు పెట్టారు. 30 మంది పిల్లల మృతి కేసులో ఆయన పేరును ఎక్కించారు. ఈ బర్డ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమా శుక్లాలను ఇదివరకే అరెస్ట్ చేశారు. తర్వాత కఫిల్ ఆచూకీ లేకుండా పోయారు. లక్నోలోని కఫీల్ కుటుంబం నుంచి సేకరించిన ఆధారాల ద్వారా ఆయన గోరఖ్ పూర్ శివారులోని ఓ ఇంట్లో ఉన్నట్లు తెలిసుకుని అదుపులోకి తీసుకున్నాడు.