నీచం... శవంపై ఆభరణాను ఇలా (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

నీచం… శవంపై ఆభరణాను ఇలా (వీడియో)

September 24, 2020

Doctor stole rings from patient.

కరోనా బాధితుడిపై చేతివాటం చూపించాడు ఓ డాక్టరు. గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉండి కూడా దొంగతనానికి పాల్పడ్డాడు. సీసీటీవీ పుణ్యమాని అతడి గుట్టు రట్టు అయింది. ఈ సంఘటన ఇటీవల తిరుపతి స్విమ్స్‌లో ఆసుపత్రిలో జరిగింది. కరోనా బారిన పడిన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె వాసి వెంకటరత్నం నాయుడు స్విమ్స్ ఆసుపత్రిలో  చేరాడు. కొన్ని రోజులు కరోనాతో పోరాడి బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని చూడ్డానికి వెళ్లిన సమయంలో కుటుంబ సభ్యులకు అతని ఒంటిపై బంగారు ఆభరణాలు కనిపించలేదు. 

తన తండ్రి చేతికి, ఒంటిపై బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆయన కొడుకు మహేష్ హాస్పిటల్ సిబ్బందిని నిలదీశారు. తొలుత హాస్పిటల్ సెక్యూరిటీ అధికారులు పట్టించుకోలేదు. గట్టిగా నిలదీయడంతో సీసీటీవీలో చెక్ చేశారు. అతని ఒంటిపై ఆభరణాలు సిబ్బందే దొంగతనం చేయడం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీని గురించి మృతిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ వీడియో ఆధారంగా దొంగను గుర్తిస్తున్నారు. ఈ దొంగతనం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోగి ఆభరణాలు దొంగలించిన డాక్టర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు.