రేపే విడుద‌ల‌.. సినిమా అదుర్స్ అంటున్న క్రిటిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపే విడుద‌ల‌.. సినిమా అదుర్స్ అంటున్న క్రిటిక్స్

May 5, 2022

సినీ ప్రియులకు భాషతో సంబంధం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా ఏ ఇండస్ట్రీకి చెందిన సినిమా అయినా సరే నచ్చితే అక్కున చేర్చుకొని ఆకాశానికెత్తెస్తారు. తాజాగా హాలీవుడ్‌కు చెందిన మార్వెల్ సంస్థ నిర్మాణంలో వ‌స్తున్న‌ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందుకు కార‌ణం.. 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడమే. ఈ సిరీస్‌లో 27వ మూవీగా మే 6న (రేపు) విడుదల అవుతున్న సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

 

అయితే విడుదలకి ముందే క్రిటిక్స్ కోసం ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో ఈ సినిమా చూసిన వారంతా.. సినిమా అద్భుతం అంటూ పొగుడుతున్నారు. గ‌తంలోనే ఏ మార్వెల్ మూవీస్‌లో లేని హైలైట్స్ ఇందులో ఉన్నాయట‌. సామ్ రైమి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వాండాగా ఎలిజబెత్ ఒల్సెన్, స్ట్రేంజ్‌గా బెనెడిక్ట్ యాక్టింగ్ ఇరగదీశారని చెబుతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుంద‌ని ట్విట్ట‌ర్‌లో పోస్టులు, రివ్యూలు పెడుతున్నారు.