కరోనా పేషంట్‌కు బర్త్ డే వేడుకలు.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పేషంట్‌కు బర్త్ డే వేడుకలు.. వీడియో

April 23, 2021

doctors celebrates patient birth day in doom days

వైద్యులు ప్రాణదాతలు. కేవలం వైద్యం చేసి ఊరుకోకుండా రోగుల్లో ఆత్మస్థైర్యం కూడా నింపుతుంటారు. కానీ కరోనా రాకతో ఈ పరిస్థితి తారుమారైంది. కొందరు డాక్టర్లు చికిత్స చేస్తూ కోవిడ్ బారినపడి చనిపోయారు. కొందరు ధైర్యంతో రోగులకు చికిత్స చేస్తున్నారు. వారిలో కొందరు మరింత ధైర్యంతో రోగులకు కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఓ కరోనా రోగికి అక్కడి వైద్యసిబ్బంది ఘనంగా బర్త్ డే వేడుక నిర్వహించారు. గురువారం ఆమె పుట్టిన రోజు కావడంతో గుర్తు పెట్టుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో హోరెత్తించారు. తుమ్ జియో హాజారో సాల్ పాట పాడి ఆమెలో ఉత్సాహాన్ని నింపారు. ఆమె కూడా సంబరంగా పాల్గొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.