అమానుషం.. రోడ్డుపైనే పోస్టుమార్టం - MicTv.in - Telugu News
mictv telugu

అమానుషం.. రోడ్డుపైనే పోస్టుమార్టం

September 28, 2018

వైద్యులను దేవుడితో పోలుస్తాం. ఎందుకంటే ప్రాణపాయ‌స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలు పోసేది డాక్టర్లే కాబట్టి. కానీ కొందరు డాక్టర్లు, నర్సులు ఆస్పత్రికి వచ్చే పేషంట్లు, మృతదేహాలపై చేసే నిర్లక్ష్యం వైద్య వృత్తికే మచ్చ తెచ్చిపెడుతోంది. తాజాగా ఓ ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు మహిళల మృతదేహాలకు బహిరంగంగా పోస్టుమార్టం నిర్వహించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మేర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం కలకలం రేపుతోంది.Doctors conducted a post-mortem outside the hospital for the bodies of two womenఒకే గ్రామానికి ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోధ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది రెండు మృతదేహాలను రోజంతా పేషెంట్లు ఉన్న జనరల్ వార్డులోనే ఉంచారు. పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి ఆస్పత్రి బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు రోడ్డుపై అందరూ చూస్తుండగా పోస్టుమార్టం నిర్వహించారు.

ఎవరికీ కనిపించకుండా నిర్వహించే పోస్టుమార్టాన్ని పట్టపగలు ప్రజలందరూ చూస్తుండగానే చేయడంతో స్థానికులు మండిపడ్డారు. ఈ విషయం వైద్యశాఖ మంత్రి కాళీ చరణ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సదరు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.