Doctors found the letter while doing the postmortem on the woman's body
mictv telugu

మహిళ మృతదేహానికి పోస్టుమార్టం.. బట్టల్లో లెటర్ కనిపించడంతో

September 16, 2022

Doctors found the letter while doing the postmortem on the woman's body

ఓ మహిళ మరణం మిస్టరీగా మారింది. పెళ్లై 11 ఏళ్లు అవుతుండగా ఇంతవరకు భర్తతో కానీ, అత్తమామలతో కానీ ఎలాంటి సమస్యలు లేవు. కూతురి సంసారంలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో మహిళ తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కానీ ఓ రోజు అల్లుడు ఫోన్ చేసి మీ కూతురి ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పాడు.

దాంతో వారు హాస్పిటల్‌కి వెళ్లగా అక్కడ డాక్టర్లు పోస్టుమార్టం చేశారు. కానీ, వారికి మహిళ దుస్తుల్లో ఓ లెటర్ దొరకడంతో సీన్ మొత్తం మారిపోయింది. హర్యానాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంబాలా జిల్లా పంచకుల గ్రామానికి చెందిన రాజ్‌వింద్ర కౌర్ అనే యువతికి మహేశ్ నగర్ లో ఉంటున్న రాజేశ్ కుమార్‌తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటినుంచి వీరి సంసారంలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఇరువైపులా ఎంతో సంతోషించారు. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో బుధవారం అల్లుడు మీ కూతరురు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో వారు వెళ్లగా కూతురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తర్వాత పరిస్థితి విషమించడంతో చండీగఢ్‌కు తరలించగా అక్కడ ప్రాణాలు విడిచింది. దీంతో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించగా, వివాహిత దుస్తుల్లో ఓ లెటర్ కనిపించింది. అందులో మరణానికి గల కారణాలు రాసి ఉన్నాయి. పోలీసులు అందులోని వివరాలు బయటికి వెల్లడించనప్పటికీ భర్త, అత్తమామలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పడంతో 11 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వివాహిత అత్తమామలు చెప్పడం గమనార్హం. కాగా, వివాహిత మరణానికి కచ్చితమైన కారణాల కోసం విసేరా రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.