భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన రొమేనియా మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ నిందితుల మెడికల్ రిపోర్టు వచ్చింది. వారందరికీ లైంగిక సామర్ధ్యం ఉందని పోలీసులకు అందిన రిపోర్టులో వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో చార్జీషీటులో ఈ నివేదిక చాలా కీలకం కానుంది. అటు, ఇంతకు ముందు నిందితులంతా బెయిల్ కోసం పిటిషన్ వేయగా, ఎవ్వరికీ బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
కాగా, కేసులో ఓ వర్గానికి చెందిన ఉన్నత రాజకీయ నాయకుల వారసులు ఉన్నారనే కారణంతో పోలీసులు సేకరించిన ఘటనా వివరాలు సమాజానికి వెల్లడించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.