కేసీఆర్ హెల్త్ అప్‌డేట్.. మెడ నరంపై ఒత్తిడితో చెయ్యి నొప్పి.. వన్ వీక్ రెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ హెల్త్ అప్‌డేట్.. మెడ నరంపై ఒత్తిడితో చెయ్యి నొప్పి.. వన్ వీక్ రెస్ట్

March 11, 2022

13

అస్వస్థతకు గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సీఎం కేసీఆర్‌కు వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వివరించారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు చెప్పిన ప్రకారం ‘ ఇవ్వాళ ఉదయం ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పారు. దాంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించాం. మెడ నరంపై ఒత్తిడి వల్ల ఎడమ చేయి నొప్పి వచ్చింది. వరుసగా ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల నీరసంగా ఉన్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. ఎక్కడా ఎలాంటి సమస్యా లేదు. ఒక వారం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మూడు గంటలకు డిశ్చార్జ్ చేస్తాం. వచ్చే ఏడాది మళ్లీ పరీక్షలు నిర్వహిస్తా’మని వెల్లడించారు.