హార్టున్న డాక్టర్ ఈయన ! - MicTv.in - Telugu News
mictv telugu

హార్టున్న డాక్టర్ ఈయన !

July 11, 2017

డాక్టర్ కు మంచి మనసుంటే ప్రతీ రోగీ అతనికి ఆత్మ బంధువే. తను చేసే వృత్తి మీద గౌరవమే కాదు ప్రజల మీద ప్రేమున్న వైద్యుడు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి. తను వారం రోజుల్లో ఏ ఒక్క రోజునీ పర్సనల్ గా వాడుకోడు. ప్రతిరోజూ ప్రజాసేవలాగే సాగిపోతోంది ఆయన వైద్య వృత్తి. హాస్పిటల్లో రోగులకు ట్రీట్ మెంట్లతోనే అర్థరాత్రి, అపరాత్రి అనకుండా సాగిపోతుంటుంది. దొరికే ఆ సండే కూడా ప్రజల కోసం వెచ్చించడం అనేది డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డికే సాధ్యమైంది. నిజమైన డాక్టర్ అనిపించుకున్నాడు. నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడి ట్రైబల్ ఏరియాలోని ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని అందుకు తగ్గ ట్రీట్ మెంటు చేస్తుంటాడు.

 

అలాగే నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజక వర్గాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు ఈ డాక్టర్ ఆత్మీయుడు. ముఖ్యంగా అక్కడి ప్రజలకు వచ్చే మోకాళ్ళు, కీళ్ళ నొప్పులకు తగు ఆపరేషను గానీ, మందులు గానీ చాలా తక్కువ ఫీజుతో వాళ్ళకు అందిస్తున్నాడు. అది కూడా ఇచ్చుకోలేని ఎందరికో ఫ్రీగా కూడా తన సేవలు అందిస్తున్నాడు. డాక్టర్లను దేవుళ్లతో పోలుస్తారు. ఆ పోలికకు ప్రతిరూపం ఈ డాక్టర్. పేదల పాలిట పెద్దన్నయ్య అయ్యాడు. హైదరాబాదు యషోదా హాస్పిటల్లో నిరంతరం రోగులకు వైద్యం చేస్తూనే ప్రతీ ఆదివారం సెలవు తీస్కోకుండా ఆ రోజు కూడా మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యం కోసం పాకులాడుతున్న దిల్లున్నవాడు ఈ డాక్టర్.

చాలా మందికి మంచి ట్రీట్ మెంటిచ్చి వారి కీళ్ళ, మోకాళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తున్నాడు. ప్రజల ఆరోగ్యం గురించి ఇంతగా తన్లాడుతున్న మంచి హృదయమున్న డాక్టర్ గా చాలా మంది వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎలాంటి ఆర్థోపెడిక్ సమస్యలున్నా వాళ్ళకి అతి తక్కువ ఫీజులతో వైద్యం చేస్తున్నాడు. అది కూడా కట్టని నిరుపేదలకు పూర్తి ఉచితంగా కూడా తన సేవలను అందిస్తున్నాడు. నిస్వార్థంతో చేసే డాక్టర్ వృత్తికే వన్నె తెస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా హార్టున్న డాక్టరే !