చీలిన అంగానికి డాక్టర్ల తేనె వైద్యం.. సక్సెస్.. - MicTv.in - Telugu News
mictv telugu

చీలిన అంగానికి డాక్టర్ల తేనె వైద్యం.. సక్సెస్..

September 24, 2019

honey......

తేనెకు వైద్యంలో ఎంత విశిష్ఠత వుందో డెన్మార్క్ వైద్యులు చెబుతున్నారు. తేనె ఆరోగ్యానికే కాదు అనారోగ్యానికి కూడా మంచి మందులా పని చేస్తుందని వారు అంటున్నారు. అంగం చీలుకుపోయిన ఓ వ్యక్తికి తేనెతో చికిత్స చేశారు. దీంతో అతని అంగానికి అయిన గాయం నయం అయింది. రోస్కిల్డ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి తన అంగానికి వున్న చర్మం వెనకకు వెళ్లడంలేదని వైద్యులను సంప్రదించాడు. అతడి అంగాన్ని పరీక్షించిన వైద్యులు అతడికి ‘బలనోపోస్తిటీస్’ ఏర్పడిందని నిర్ధారించారు. 

దీనివల్ల అతడి శిశ్నంపై గడ్డలు ఏర్పడినట్లు చెప్పారు. గడ్డలతో ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందని, సర్జరీ చేసి ఆ గడ్డలను తొలగించాలని అతడికి చెప్పారు. సర్జరీకి అతను ఒప్పుకోవడంతో వైద్యులు బాధితుడి అంగం చుట్టూ పలుచటి చర్మాన్ని చీల్చి గడ్డలు తొలగించారు. అయితే తిరిగి ఆ చర్మాన్ని అతికించడంలో వైద్యులు విఫలం అయ్యారు. దానిని తిరిగి అతికించలేకపోయారు. అప్పుడు వారికి ఒక ఐడియా వచ్చింది. అంతే దానిని ఫాలో అయిపోయారు. చర్మాన్ని దగ్గరకు లాగి సర్జికల్ ప్లాస్టర్‌తో అతికించి దానిపై తేనె పోసి డ్రెస్సింగ్ చేశారట. రెండు వారాల తర్వాత పరిశీలించగా.. అంగంపై చర్మం అతుక్కుపోయింది. దీంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. ఈ అరుదైన చికిత్స వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జీరీ కేస్ రిపోర్ట్స్‌లో వైద్యులు వెల్లడించారు.

ఇలాంటి చికిత్సలకు తెనే వాడాలని.. తేనే యాంటి బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుందని సలహా ఇస్తున్నారు. తేనెతో ఎలాంటి నొప్పి కలగదని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యాంటీబయోటిక్‌గా కూడా తేనెను వాడవచ్చని వారు కచ్చితంగా చెబుతున్నారు. అంగం, శిశ్నం, ఇతరాత్ర చర్మ సమస్యలకు తేనె మంచి ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు.