తెగిన చేతిని అతికించారు... - MicTv.in - Telugu News
mictv telugu

తెగిన చేతిని అతికించారు…

August 23, 2017

 

ఓ కార్మికుడు రబ్బర్ యంత్రంతో పనిచేస్తుండగా తెగిపోయిన చేతిని హైదరాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తిరిగి అతికించారు. చౌటుప్పల్ లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బిహార్ వాసి అఖిలేశ్ కుమార్ ఇటీవల యంత్రం వద్ద పనిచేస్తుండగా అరచేయి పూర్తిగా తెగిపోయింది. అతణ్ని ఆస్పత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది.

ప్రమాదం జరిగిన తర్వాత 10 గంటలకు యశోదా ఆస్పత్రికి తరలించారు. తెగిన చేతిని కూడా తీసుకొచ్చారు.  ఆలస్యం కావడంతో చేయిని తిరిగి అతికించే అవకాశం ఉండకపోవచ్చని తొలుత భావిచారు.

అయితే ఆస్పత్రిలోని డాక్టర్ శశికాంత్ మద్దు, డాక్టర్ దేవేందర్ సింగ్ తదితర వైద్య నిపుణులు చాలా కష్టపడి చేతిని తిరిగి అతికించారు. చేతికి శరీరంలోని ఇతర భాగాల నుంచి రక్త సరఫరాను పునరుద్ధరించారు.

చికత్స తర్వాత అఖిలేశ్ బుధవారం ఆస్పత్రిని నుంచి డిశ్చార్జి అయ్యాడు.  వైద్యులు కష్టంతో ఆపరేషన్ పూర్తి చేసి.. కాయకష్టంతో బతుకుతున్న అఖిలేశ్ కు మరో జన్మనిచ్చారని పలువురు అభినందిస్తున్నారు.