ఆకలి వేస్తే అతను డబ్బులు తినేస్తాడు..ఏమైనా నోటికి తినాలి అనిపిస్తే చాలు ఓ కాయిన్ పొట్ట లోపలకి ఆహారంగా వెళ్లిపోతుంది. అదే అతడికి అలవాటుగా మారింది. దీంతో అతడి కడుపు నాణెలతో నిండిపోయింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసుగూరు తాలూకా సంతేకల్లూరుకు చెందిన ఓ వ్యక్తి కడుపు నుంచి ఏకంగా 187 నాణెలను బయటకు తీశారు వైద్యులు. వివారాళ్లోకి వెళితే ..58 ఏళ్ల ద్యామణ్ణకు కడపునొప్పి రావడంతో కుటుం సభ్యులు బాగలకోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మొదట అతడికి స్కానింగ్, ఎక్స్ర్ రే తీయగా వచ్చిన రిపోర్ట్స్ చూసి వైద్యులు అవాక్కయ్యారు. కడుపులో అనేకమైన నాణెలు చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అతనికి ఆపరేష్న్ చేసి 187 కాయన్స్ను బయటకు తీశారు. వాటిలో రూ.5 నాణేలు 56, రూ.2 నాణేలు 51, రూపాయ నాణేలు 80 వరకు ఉన్నాయి. వీటి బరువు కిలోపైన ఉంది. ఇలాంటి కేసులు అరుదుగా చూస్తామని వైద్యులు తెలిపారు. మతి స్థిమితం లేక ద్యామణ్ణ నాణేలు మింగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.