చెవిలోని జోరీగను ఇలా తీశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

చెవిలోని జోరీగను ఇలా తీశారు..

September 1, 2017

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

కంటిలోని నలుసు కాలిముల్లు

ఇంటిలోని పోరు నింతింత గాదయా

విశ్వదాభిరామ! వినురవేమ!

అని అన్నాడు యోగి వేమన ఎప్పుడో.  చెప్పులోని రాయి బాధ మనకు అనుభవమే. చెవిలోని జోరిగే పెద్దగా అనుభవంలోకి రాదు. అయితే సింగపూర్ ఓ వ్యక్తికి మాత్రం ఇది నరకయాతనగా మారింది. చెవిలో జోరిగ లాంటి పురుగొకటి తిష్టవేసుకుని కూర్చుని రక్తం పీల్చేస్తోంది. ఈ బాధ భరించలేక  ఆస్పత్రికి వెళ్లాడు.

వైద్యులు మైక్రో కెమరాతో పరిశీలించి. .చెవిలోపల ఓ ఎనిమిది కాళ్ల పరాన్నజీవి అతుకుని ఉందని, రోగి రక్తాన్ని పీల్చేస్తూ జీవిస్తోందని తేల్చారు. ఆధునిక టెక్నాలజీతో సర్జరీ చేసి ఆ పురుగును బయటికి లాగారు. రక్తానికి అలవాటుపడిన సదరు పురుగు గట్టిగా గుంజితేనేగాని బయటికి రాలేదు. ఈ లాగుడు వల్ల కాస్త రక్తస్రావం కూడా అయింది.