జీతాలు తగ్గించాలని వైద్యులు నిరసనలు! - MicTv.in - Telugu News
mictv telugu

జీతాలు తగ్గించాలని వైద్యులు నిరసనలు!

March 14, 2018

మీరు చదివింది కరక్టే. జీతాలు తగ్గించాలనే నిరసనలు… పెంచాలని కానేకాదు. లోకంలోని ఉద్యోగులంతా జీతాలు పెంచాలని కోరుకుంటూ ఉంటే ఈ డిమాండేమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ముచ్చట మనదేశానిది కాదులెండి, కెనడాది. అక్కడ 800 మంది వైద్యులు ఈ డిమాండుతో రోడ్డెక్కారు. తమకు ఇవ్వాల్సిన జీతాలకంటే ఎక్కువ ఇస్తున్నారని, ఇది న్యాయం కాదని వారు అంటున్నారు. క్యూబెక్ నగరంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. 700 మంది వైద్యులు, మెడికోలు ఒక ఆన్‌లైన్ పిటిషన్ పై సంతకాలు చేసి మరీ సర్కారుకు విన్నవించారు. Médecins Québécois Pour le Régime Public (MQRP) అనే సంఘం గత నెలాఖర్లో ఈ ఉద్యమాన్ని చేపట్టింది.

క్యూబెక్ రాష్ట్రంలో ఇటీవల డాక్టర్ల జీతాలను పెంచారు. ఏడాదికి రూ. 2 కోట్లు ఉన్న జీతాన్ని మరో రెండు శాతం పెంచారు. అయితే నర్సులు, క్లర్కులు, పారిశుద్ధ్య సిబ్బంది జీతాలను మాత్రం పెంచలేదు. అంతేకాకుండా వారికి ఓవర్ డ్యూటీలనూ వేస్తున్నారు. ఇది బాధితులకే కాకుండా వైద్యులకు కూడా ఆగ్రహం తెప్పించింది. తమ జీతాల పెంపును రద్దు చేసి, పెంచిన మొత్తాన్ని కిందిస్థాయి సిబ్బంది జీతభత్యాలకు కేటాయించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత మంచి వైద్యులో కదా..!