మల ద్వారంలో చొచ్చుకెళ్లిన స్టీలు గ్లాసు.. ఎలా తీశారంటే
బీహార్‌లో డాక్టర్లతో పాటు మామూలు జనాలు షాక్‌కు గురయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మల ద్వారంలోకి స్టీలు గ్లాసు చొచ్చుకెళ్లగా, గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మొదట వివరాలు కనుక్కున్న డాక్టర్లు ఆశ్చర్యపోయి.. ఆపరేషన్ ద్వారా గ్లాసును బయటికి తీశారు. నవాదా జిల్లాు చెందిన బాధిత వ్యక్తి స్టీలు గ్లాసుని బోర్లా పెట్టి దానిపై కూర్చున్నాడు. దాంతో అది లోపల దాకా వెళ్లి ఇరుక్కుపోయింది. నొప్పితో విలవిలలాడుతున్న బాధితుడిని పాట్నాలోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ వినయ్ వినయ్ కుమార్ అధ్వర్యంలోని ఐదుగురు వైద్యులు పరీక్షించి మల ద్వారం ద్వారా గ్లాసు బయటికి తీయలేమని నిర్ధారించారు. దాంతో కడుపు వైపు నుంచి ఆపరేషన్ చేసి గ్లాసును విజయవంతంగా బయటికి తీశారు. తర్వాత గ్లాసు ఎలా వెళ్లింది అని డాక్టర్లు ప్రశ్నించగా, బాధితుడు మతిస్థిమితం కోల్పోయాడని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే డాక్టర్లు బాధితుడి మతిస్థిమితం బాగానే ఉందని చెప్తున్నారు. తాంత్రిక విద్యలు నేర్చుకునే క్రమంలో గ్లాసుపై కూర్చుని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.