గజినిలో నటించి పొరపాటు చేశా.. నయనతార - MicTv.in - Telugu News
mictv telugu

గజినిలో నటించి పొరపాటు చేశా.. నయనతార

May 10, 2019

ఈ సినిమాలో మీ పాత్ర చాలా బాగుంటుంది. చాలా లెంతీ పాత్ర. మీకు మంచి పేరు వస్తుంది.. ఇలా దర్శకులు, నటీనటుల వద్ద చెప్తారు. తర్వాత సీన్ మారిపోతుంది. లేదంటే ఎడిటింగ్‌లో ఆ పాత్ర నిడివిని కట్ చేస్తారు. దీంతో చాలామంది నటులు బాధపడ్డ సందర్భాలు వున్నాయి. అవన్నీ ఎవరూ బయటికి చెప్పుకోరు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదీ దాగటంలేదు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ పుణ్యమా అని అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో నటి నయనతార తన సినీ కెరీర్‌లో జరిగిన ఓ పొరపాటు గురించి ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా బాహటంగా చెప్పింది.

Does Nayanthara regret doing Suriya’s movie Ghajini.

‘గజిని’ చిత్రంలో తాను అనవసరంగా నటించానని.. తన కెరీర్‌లో ‘గజిని’ సినిమాను ఎంచుకోవడమే తాను చేసిన తప్పని చెప్పింది. 2005లో వచ్చిన ‘గజిని’ సినిమాలో నయనతార చిత్ర అనే డాక్టర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర గురించి దర్శకుడు ఏ.ఆర్‌ మురుగదాస్‌ ఆ పాత్ర గురించి వేరేలా వివరించాడని.. షూటింగ్ సమయంలో మార్చేశాడని చెప్పింది. ఆ సినిమా అనుభవంతో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేటప్పుడు జాగ్రత్తగా వుండాలని పేర్కొంది. గజినిలో సూర్య, ఆసిన్ నటించారు. ఈ సినిమాను మురగదాస్ హిందీలో కూడా తెరకెక్కించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత నయన్ మళ్లీ మురగదాస్ ‘దర్బార్’ చిత్రంలో నటిస్తోంది. రజనీకాంత్‌కు జోడీగా నటిస్తోంది. మరి నయన్ వ్యాఖ్యలపై మురగదాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.