సెలక్షన్ కమిటీకి బుద్ధిలేదు.. కపిల్ దేవ్ - MicTv.in - Telugu News
mictv telugu

సెలక్షన్ కమిటీకి బుద్ధిలేదు.. కపిల్ దేవ్

February 25, 2020

Team India

ఎప్పుడూ కూల్‌గా ఉండే టీమిండియా సీనియర్ ఆటగాడు కపిల్‌దేవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  బుద్ధి ఉండక్కర్లే.. అంటూ టీమిండియా సెలక్షన్ కమిటీపై మండిపడ్డారు. తాము ఆడినప్పటి రోజులకు, ప్రస్తుతం జరుగుతున్న ఆటలకు మధ్య చాలా తేడా ఉందని కపిల్ గుర్తు చేసుకున్నారు. 

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వన్డే, టెస్టు సిరీస్‌లలో పేలవమైన ప్రదర్శన ఇవ్వడంపై ఆయన స్పందించారు. ‘అసలు జట్టులో ఇన్ని మార్పులు ఎలా చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ భారత జట్టు దాదాపు కొత్తగా కనిపిస్తోంది. జట్టులో ఏ ఆటగాడికీ శాశ్వత స్థానం లేదు. ఈ రోజు ఉన్న ఆటగాడు రేపు కనిపించడం లేదు. జట్టులో తమ స్థానానికి భద్రత లేనప్పుడు అది ప్లేయర్ల ఫామ్‌పై ప్రభావం చూపిస్తుంది. జట్టులో అంతపెద్ద ఆటగాళ్లు ఉండి కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200 పరుగులు చేయకపోవడం దారుణం. మరింత ప్లాన్డ్‌గా, మరింత వ్యూహాత్మకంగా ఆడాలి. జట్టులో కేఎల్ రాహుల్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఓ జట్టును తయారుచేస్తున్నామంటే ఆటగాళ్లలో అది ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉండాలి. జట్టులో ఇన్నిన్ని మార్పులు చూస్తుంటే మేనేజ్‌మెంట్‌కు బుద్ధి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. బుద్ధి లేకపోవడం వల్లే గొప్ప ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టారు’ అని కపిల్ మండిపడ్డారు. 

ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కొనసాగించాలనే తాను చెబుతానని కపిల్‌దేవ్ పేర్కొన్నారు. అనంతరం న్యూజిలాండ్ మంచి ఆట ఆడుతోందని ప్రశంసించారు. మూడు వన్డేలు, తాజాగా ముగిసిన టెస్టులో కివీస్ అద్భుతంగా ఆడిందని కొనియాడారు.