భాష, ప్రాంతం అనే బేధం లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా, సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలు సినిమాల సీక్వెల్స్ .. సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ క్రియేట్ చేసి రికార్డులు బద్ధలు కొట్టాయి. మరికొన్ని సీక్వెల్స్ సెట్స్‌పై ఉన్నాయి. అయితే గతంలో సూర్య హీరోగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా 24. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన 24 మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. అయితే.. ఈ సినిమాకు కూడా త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ట్విటర్ లో రహీన్ రాజ్ అనే వ్యక్తి.. 24 సినిమా దర్శకుడు విక్రమ్ కె.కుమార్, హీరో సూర్య లను ట్యాగ్ చేస్తూ.. ఓ పోస్ట్ చేశాడు. 2024 లో ఈ సినిమా విడుదలవబోతుందని మెసేజ్ చేశాడు. కానీ ఇందులో ఎంతవరకూ నిజమనేది తెలియదు.
After long… Its Now Confirmed..!!
Soon Soon 2024 🔜#24TheMovie2 #24-2 #24TheMovieSequel@Suriya_offl @Vikram_K_Kumar#Vanangaan #வணங்கான் #VaadiVaasal #TeamAathreya pic.twitter.com/PIHuxTtRRt
— RaHiN rAj ᵀᴹ SFC ʀᴏʟᴇx (@Rahinraj_Offl) July 15, 2022
సూర్య హీరోగా ఈ సినిమాలో త్రిబుల్ రోల్ లో సూర్య నటించిన సంగతి తెలిసిందే (మణికందన్ అనే యువకుడిగా, ఆత్రేయ అనే విలన్ గా, సైంటిస్ట్ సేతురామన్ గా కనిపించాడు). ఈ సినిమాతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నాడు విక్రమ్ కె కుమార్. ఇక ప్రస్తుతం అతడు నాగచైతన్యతో థాంక్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జూలై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.