రైళ్లలో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తే జాగిలం మీ పని పట్టేస్తుంది! - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లలో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తే జాగిలం మీ పని పట్టేస్తుంది!

November 19, 2019

Dog ........

రైలు ప్రయాణం చేసే సమయంలో చాలా మంది ఫుట్ బోర్డు వద్ద నిల్చొని ప్రయాణిస్తుంటారు.ఇలా చాలా మంది ప్రమాదానికి గురౌతున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడంలేదు. కొన్ని సార్లు పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. కానీ ఈ కుక్క మాత్రం అలా కాదు. ఎవరైనా ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తే చాలా వెంటనే వారి వద్దకు వెళ్లి మొరుగుతూ హెచ్చరిస్తుంది. వారు లోపలికి వెళ్లే వరకూ వెంటాడుతూనే ఉంటుంది. చెన్నై పార్క్‌టౌన్ రైల్వేస్టేషన్‌లో ఉన్న ఈ కుక్క ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. దీని పేరు చిన్నపొన్ను 

కొన్ని రోజుల క్రితం ఈ కుక్క రైల్వే స్టేషన్‌లో కనిపించింది. చిన్నపొన్ను యజమాని ఇంట్లో దాని గోల భరించలేక స్టేషన్లో వదిలేసి పోయాడు. దాన్ని చూసిన వచ్చింది రైల్వే రక్షణ దళం పెంచుకుంటోంది. వారితో పాటు డ్యూటీకి తోడుగా తీసుకెళ్లడం ప్రారంభించారు. వారి డ్యూటీని చూసి ఆ కుక్క విశ్వాసంతో ఆర్‌పీఎఫ్ దళంతో కలిసి పనిచేయడం ప్రారంభించింది.రైళ్లలో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్నా, రన్నింగ్ రైలు ఎక్కినా, దిగినా, ఫ్లాట్ ఫాం మారేందుకు పట్టాలు దాటుతున్న ప్రయాణికులను  హెచ్చరిస్తుంది. అధికారులు కొన్ని సార్లు చూసి చూడనట్టు వదిలేసినా ఆ కుక్క మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టదు. దీనికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. అనుమానితులు దొంగలు తనకంట పడితే చాలు వెంటనే మొరగడంతో అధికారుల పని కూడా చాలా సులభం అయిపోయింది. ఈ జాగిలాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.