పెంపుడు కుక్క మనుషుల బెస్ట్ ఫ్రెండ్ అంటారు. పెంపుడు కుక్కలు తమ యజమానులు ముఖంలో బాధను గుర్తించి ఓదార్చుతాయని శాస్త్రవేత్తలు కూడా అనేక సార్లు వెల్లడించారు. తిండి పెట్టి పెంచుకున్న యజమాని అకస్మాత్తుగా హాస్పిటల్ పాలైతే కుక్కలు ఆ హాస్పిటల్కి వెళ్లిన సంఘటనలు ఎన్నో జరిగాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియో ఉన్న మాటలు ప్రకారం అది చైనాలో జరిగినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో ఓ చిన్నపాప ఆడుకునే బొమ్మను విరగొట్టింది. దీంతో ఆ పాప తల్లి ఆమెపై అరుస్తోంది. దీంతో ఆ పాప ఏడవడం మొదలుపెట్టింది. ఈ తతంగాన్ని గమనిస్తున్న వాళ్ళ పెంపుడు కుక్క ఆ తల్లిపై అరవడం మొదలు పెట్టింది. ఆ పాపను తిట్టకని ఆ కుక్క అరుస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ తల్లి తిట్టి పోయిన తరువాత ఆ పాపను కుక్క ఓదార్చింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Publiée par Ramani Sri sur Mardi 13 octobre 2020