కుక్కపిల్లను చంపి రూ. 250 ఇచ్చి, దాడి చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కపిల్లను చంపి రూ. 250 ఇచ్చి, దాడి చేసి..

September 30, 2020

Dog car issue Hyderabad .

తప్పు చేసిన వాడు దౌర్జన్యం కూడా చేశాడు. మూగజీవిని చంపేసి, దాన్ని పెంచుకుంటున్న ఇంట్లోని మనుషులపై దాడి చేశారు. ప్రాణానికి విలువ కట్టి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ హయత్ నగర్‌తో ఈ దారుణ జరిగింది. ‘చచ్చింది కుక్కేగా రూ. 250 తీసుకుని నోర్మూసుకోండి..’ అంటూ పోలీసులు సాక్షిగా పంచాయతీ కూడా జరిగిపోయింది. 

బాధితుడు శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్‌డౌన్‌ సమయంలో కాలక్షేపంగా ఉంటుందని అతడు లాబ్రాడర్ జాతి కుక్కపిల్లను తెచ్చుకున్నాడు. శనివారం కూతురితో కలసి  ఆ కుక్కపిల్లను టాయిటెల్ కోసం రోడ్డుపైకి తీసుకొచ్చాడు. ఆ సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు మూగజీవిని గుద్దేసింది. శ్రీనివాస రావుకు, అతని కూతురుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కారు యజమాని వెంకటేశం ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అతడు రెచ్చిపోయాడు. ‘ఏదో మనిషి చచ్చినట్లు అరుస్తారేం’ అని కసురుకున్నాడు. మరోపక్క శ్రీనివాసరావు ఆ కారులో కుక్కపిల్లను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. దీన్ని జీర్ణించుకోలేని వెంకటేశం, అని బంధుమిత్రులు 50 మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై పడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఏమీ పట్టించుకోకుండా కేసు పెట్టి నిందితులను వదిలేశారు. దాడి చేస్తున్నప్పుడు పోలీసులు కూడా అక్కడున్నారని శ్రీనివాసరావు చెబుతున్నాడు.