తోటి జీవికి సాయం.. రక్తదానం చేసిన కుక్క - MicTv.in - Telugu News
mictv telugu

తోటి జీవికి సాయం.. రక్తదానం చేసిన కుక్క

January 18, 2020

ytunhb

మనిషికి మనిషి రక్త దానం చేసుకోవడం చూశాం. దీని కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు అయ్యాయి. అత్యవసర సమయాల్లో చాలా మంది తమ రక్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తారు. అది మనుషుల్లోనే కాదు తమలోనూ ఉందని ఓ కుక్క నిరూపించింది. అనారోగ్యంతో ఉన్న తోటి శునకానికి రక్తదానం చేసి ఔరా అనిపించింది.కర్ణాటకలో సుందర పట్టణంలో ఇది జరిగింది. ఈ కుక్క తాను చేసిన సాయంతో ఇప్పుడు అందరితో ప్రశంసలను అందుకుంటోంది. 

మనీషా కులకర్ణి అనే విద్యార్థి రెండేళ్లుగా రాట్ వైలర్ జాతి కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి రానా అనే పేరు కూడా పెట్టాడు. కానీ అది ఇటీవల కామెర్ల బారిన పడి రోటీ అనారోగ్యం పాలైంది. దీంతో వైద్యులను సంప్రధించగా దానికి రక్తం అవసరం అయింది. ఈ విషయం తెలిసిన . ధార్వాడ్‌కు చెందిన గణేశ్  అదే జాతికి చెందిన రోటీ అనే శునకం రక్తధానం చేసేందుకు అంగీకరించాడు. దీంతో దాని నుంచి రక్తం సేకరించి రానా ప్రాణాలు నిలబెట్టారు. ఓ శునకం మరో శునకం ప్రాణం నిలబెట్టడంపై పలువురు అభినందిస్తున్నారు.