కుక్కను లారీకి కట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కను లారీకి కట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లి..

April 3, 2018

ఇతర జీవులకూ ప్రాణం ఉంటుందని, వాటికీ కష్టసుఖాలు ఉంటాయని మనుషులు మరచిపోతున్నారు. మూగజీవాలను దారుణంగా హింసించి చంపుతున్నారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం ఘోరం జరిగింది. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఓ కుక్కను లారీ వెనక భాగంలో తలకిందులుగా వేలాడదీసి 3 కి.మీ. దూరం ఈడ్చుకెళ్లారు. అది నరకయాతన అనుభవించింది.

ఈ దృశ్యాన్ని రోడ్డుపై వెళ్లున్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. జంతు సంరక్షణ కార్యకర్తలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ నంబరు టీఎస్12యూఏ 7037 ఆధారంగా దాన్ని గుర్తించిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు డ్రైవర్2ను అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు. తీవ్రంగా గాయపడిన కుక్క  చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. లారీకి కుక్కను కట్టేసిన సంగతి తనకు తెలియదని డ్రైవర్ చెప్పాడు. ఈ లారీ గతంలో నో ఎంట్రీ జోన్‌లోకి రెండుసార్లు చొరబడ్డంతో జరిమానా వేసినట్లు పోలీసులు తెలిపారు.