గడియపెట్టుకున్న కుక్క.. శ్మశానంలో సస్పెన్స్  - MicTv.in - Telugu News
mictv telugu

గడియపెట్టుకున్న కుక్క.. శ్మశానంలో సస్పెన్స్ 

August 4, 2020

Dog in funeral place in sangareddy

కుక్క గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న వింత సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలో తుర్కపల్లి తండా శివారులో జరిగింది. ఆ తండాలో కొత్తగా శ్మశానంలో ఓ గదిని నిర్మిస్తున్నారు. ఆ గదిలోకి కుక్క వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. ఉదయాన్నే ఆ గదికి సున్నం వేయడానికి వచ్చిన కూలీలు తలుపు తీయడానికి ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. 

దీంతో నిచ్చెన సహాయంతో కిటికీ నుంచి లోపలికి తొంగి చూడగా అందులో కుక్క గడియ పెట్టుకుని ఉంది. దీంతో షాకైన కూలీలు సమీపంలో ఉన్న ఓ పొడవైన కర్ర సాయంతో తలుపు గడియను తీశారు. ఈ తతంగాన్ని అంతా అక్కడ ఉన్నవారు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క కూడా ప్రైవసీ కోరుకుంటుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.