కుక్క గయాబ్... ఆ తరువాత ? - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క గయాబ్… ఆ తరువాత ?

June 22, 2017

ఈ వార్త సద్విన  తర్వాత వీళ్లు ఒక్క వారం మన తాన్కివొస్తే ఏంత బావుండని  తప్పక అనుకుంటరు… ముందుగాల వార్త  చదవండి…..ఏ ఫుడ్డును ఇష్టంగా షుష్టుంగా భోం చేస్తావంటే చికెన్ ప్రియులైతే… కోడి కూర, ప్రై, చారు… లెగ్ పీస్… దాంట్లున్న రకాలన్నీ చెప్తారు. మటన్ అయితే దాంట్లో వెరైటీలన్నీ చెప్పొచ్చు.. లేదంటే ఫ్రై వరకైతే ఓకే అనొచ్చు. కానీ చైనా దేశంల మాత్రం నీకిష్టమైన నాన్ వెజ్ ఏందంటే… లొ…లొ…లొ…లొట్టలేసుకుంట చెప్పే  నాన్ వెజ్ కుక్క కూర.

ప్రతియేటా చైనా దేశంలోని యూలిన్ నగరంలో ప్రతియేటా ఇదే సమయంలో డాగ్ మీట్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిపై అక్కడ పెద్ద వివాదమే  నడుస్తున్నది. కుక్కను తినుడు మంచిది కాదు… ఎట్లా తింటాం అని అడిగేవాళ్లు కూడా బాగా మందే ఉన్నరు. అయితే  అక్కడ ఈ సీజన్ లో పెంచుకున్న కుక్కలను మాత్రం బయటకు అస్సలు వెళ్లనీయరట. ఏ వీధిల ఎవరి కుక్క గయాబ్ అవుతుందో  తెలియదట. తాము ప్రేమగా పెంచుకున్న కుక్క విషయంలో ఏమాత్రం  ఏమరు పాటుగా ఉన్నా కొన్ని గంటల్లో ఎవరి కిచెన్లోనో అతి కుతకుత ఉడుతుండొచ్చు. కాబ్టటి ఈ కుక్కల కూర తినుడు పండగను ఆపాలని అక్కడి కొందరు అంటున్నారట. అయితే మన తాన ఒక్క హైద్రాబాద్లనే 4 నుండి 5 లక్షలకు పైగా వీధికుక్కలున్నయట. వాటిని పట్ట లేక… నియంత్రణ చేయలేక మన జిహెచ్ఎంసి అధికారులు కిందా మీదా అయితున్నరు. నిజంగానే ఈ విషయం యూలింగ్ వాసులకు తెలిస్తే అస్సలు పండగ అప్పుడు చేసుకుంటరు గావొచ్చు.