కుక్క నోట రాణు మోండల్ పాట.. రెండాకులు ఎక్కువే చదివింది - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క నోట రాణు మోండల్ పాట.. రెండాకులు ఎక్కువే చదివింది

January 19, 2020

Ranu Mondal.

మనం ఏం మాట్లాడితే చిలుకలు అవే మాట్లాడతాయి. చిట్టిపొట్టి మాటలతో చిలుకలు అలరిస్తాయి. అయితే చిలుకలు మాటల మట్టుకే ఉన్నాయి కానీ, ఈ కుక్క వాటికన్నా ఓ ఆకు ఎక్కువే చదివినట్టుంది. అవి మాట్లాడితే ఇది పాట పాడుతోంది. కుక్కు ఏంటి.. పాట పాడటం ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఈ కుక్క స్పెషాలిటీ అదీ మరి. తన యజమాని చక్కగా హార్మోనియం పెట్టె వాయిస్తూ బాలీవుడ్ గాయని రాణు మోండల్ పాడిన ‘తేరీ మేరీ తేరీ మేరీ కహానీ’ పాట పాడుతున్నారు. కుక్క కూడా ఆయన రాగానికి శృతి కలిపింది. రాగాలు తియ్యటానికి ప్రయత్నించింది. చలాకీగా తన స్టైల్లో రాగాలు తీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.