గుంటూరులో ఘోరం.. కుక్కలకు బలైన చిన్నారి
గుంటూరు జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి. మనుషుల అలికిడి తగ్గడంతో ఓ బాలికను కరిచి చంపేశాయి. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. షేక్ సపూరా అనే మూడేళ్ల బాలిక మరో అమ్మాయితో కలసి ఆడుకుంటుండగా నాలుగు కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో పెద్దలు చుట్టుపక్కల లేకపోవడంతో క్రూరంగా కరిచాయి.
తీవ్రంగా గాయపడిన సపూరాను తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఆహారం దొరక్కా, మనుషుల కనిపించక కుక్కల ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. గద్వాలలో మాటిమాటికీ కక్కుతూ హడలెత్తించాయి. వాటికి కూడా కరోనా సోకి ఉండొచ్చన అనుమానంతో పరీక్షలు చేయగా నెటిగివ్ వచ్చింది.