మనుషుల నుంచి కుక్కలకు కరోనా వైరస్! - Telugu News - Mic tv
mictv telugu

మనుషుల నుంచి కుక్కలకు కరోనా వైరస్!

May 17, 2020

gcnfgnh

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా గత రెండు నెలలుగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ అయింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కేసులు పూర్తిగా తగ్గినా దేశాల్లో కూడా మళ్ళీ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 50 లక్షలు దాటిపోయాయి. కరోనా కారణంగా 3లక్షల 12 వేల మందికి పైగా మరణించారు. కరోనా జంతువులకు కూడా సోకుతుందని కొందరు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించింది ప్రచారం జరుగుతోన్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ వైరస్ మనుషుల నుంచి కుక్కకు కూడా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్ లో మనుషుల నుంచి రెండు కుక్కలకు కరోనా వ్యాపించింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అదే విధంగా అమెరికాలోని జూలో సింహాలు, పులులకు కూడా కరోనా వ్యాపించింది. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.