సాయుధ దుండగులు వీధికుక్కలపై ప్రతాపం చూపించారు. సహాయక శిబిరంలోని 29 మూగజీవాలను అత్యంత దుర్మార్గంగా కాల్చి చంపారు. గల్ఫ్ దేశమైన ఖతర్‌లో ఈ దారుణం జరిగినట్లు దోహాలోని జంతుహక్కుల సంస్థ పాస్ తెలిపింది. దుండగుల్లోని ఒకడి కొడుకును ఏదో కుక్క కరిచిందుకు ప్రతీకారంగా ఈ శునకమేధానికి పాల్పడ్డారు.
తుపాకులతో వచ్చిన దుండగులు వీధికుక్కలపై విచక్షణ రహితంగా కాల్పలు జరిపారని పాస్ తెలిసింది. ‘వారిని అక్కడి సంరక్షకరులు అడ్డుకోబోయారు. అయితే తమపైనా కాల్పులు జరుపుతారని భయపడ్డారు. దుండుగల కాల్పుల్లో ఒక కుక్కపిల్లకు గాయలయ్యాయి. అది ప్రస్తుతం చావు బతుకుల్లో ఉంది. ఎవరికీ హాని చేయని కుక్కులపై చంపడం మానవతే మచ్చ’ అని వెల్లడించింది.