వీధి కుక్కల బెడద అన్నీచోట్లా ఉన్నదే. హైదరాబాద్‌లో ఊరకుక్కలు ఓ చిన్నారిని చంపడంతో ఈ సమస్య మళ్లీ దృష్టికి వచ్చిందందే. వీధికుక్కలకు జీవకారుణ్యంతో తిండిపడేస్తున్నవాళ్లు వాటి వల్ల ఎదురయ్యే ముప్పును పట్టించుకోకపోవడంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొందరు కుక్క కాటుతో చనిపోతుంటే, కొందరు సూదిపోట్లతో యాతనపడుతున్నాడు. తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో కుక్కల గొడవ మనుషుల మధ్య గొడవ పెట్టి రక్తం కళ్లజూసింది.
మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న కొండబాబు కొందరు కుర్రాళ్లను కత్తితో పొడిచేశాడు. అతనికి వలంటీర్ ఉజ్జోగంతోపాటు మాంసం అమ్మే వ్యాపారం కూడా ఉంది. మాంస వ్యర్థాల కోసం కుక్కలు అక్కడ తిరుగుతుంటాయి. అవి దొరికిందేదో తిని ఊరుకోకుండా బైక్‌పై వెళ్తున్న యువకులను వెంటపడ్డాయి. కుర్రాళ్లు భయపడిపోయి గొడవకు దిగారు. కుక్కలను కంట్రోల్లో పెట్టుకోవాలంటూ కొండబాబుకు చెప్పారు. దీంతో వారికీ, అతనికీ మధ్య గొడవ మొదలైంది. కొండబాబు కోపం తట్టుకోలేక మాంసం కొట్టే కత్తితో ముగ్గురిపైనా దాది చేశాడు. తీవ్ర గాయాలైన బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కొండబాబుపై కేసు నమోదు చేశారు.