Doing an action adventure film with Mahesh Babu: Rajamouli
mictv telugu

మహేష్‌తో నేను చేసే మూవీ ఎలా ఉంటుందంటే.. రాజమౌళి

September 13, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతుందని టాక్ వినిపిస్తోంది. కేఎల్ నారాయణ నిర్మించే ఈ చిత్రం కోసం రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే రెండు కథలను సిద్ధం చేశారని, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథాంశం ఉంటుందనే వివరాలు బయటికి వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళి ఈ సినిమాపై అంచనాలను పెంచే వార్త ఒకటి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. అక్కడ తాను చేయబోయే తదుపరి చిత్రం గురించి ప్రశ్న రాగా దానికి రాజమౌళి ఇలా సమాధానమిచ్చారు. మహేష్‌తో చేయబోయే సినిమా ప్రపంచ సాహసికుడి ప్రయాణం అని ఒక్కముక్కలో చెప్పేశారు. అంటే గ్లోబల్ మూవీగా, యాక్షన్ అడ్వెంచరస్ జోనర్‌లో సినిమా తెరకెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఆఫ్రికా కాదని, అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధికోసం జరిగే పోరాటంగా కథాంశం ఉండబోతోందని మరో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి పాన్ వరల్డ్ సినిమాను రూపొందిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలవుతుందని సినీ వర్గాల సమచారం. కాగా, మహేశ్ ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్‌లో ఇటీవలే పాల్గొన్నారు.