విమాన టికెట్ల ధరలు తగ్గించిన కేంద్రం..ఎయిర్‌లైన్లకు షాక్
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయిన సంగతి తెల్సిందే. తాజాగా1 దేశీయ విమాన సర్వీసులను ఈనెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి నిన్న ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. ఇక విమాన ప్రయాణీకులకు సంబంధించి నిర్ధేశిత ప్రమాణాలు, మార్గదర్శకాలను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఈరోజు విడుదల చేసింది. అలాగే విమాన టిక్కెట్ ధరలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఢిల్లీ-ముంబయి విమాన ప్రయాణం కనీస టిక్కెట్ ధర రూ.3,500- రూ.10,000గా నిర్ణయించారు. విమాన ప్రయాణాన్ని మొత్తం ఏడు కేటగిరీలుగా విభజించారు.. 0 నుంచి 30 నిమిషాలు.. 30 నుంచి 60 నిమిషాలు, 60 నుంచి 90 నిమిషాలు, 90 నుంచి 120 నిమిషాలు, 120 నుంచి 150 నిమిషాలు, 150 నుంచి 180 నిమిషాలు, 180 నుంచి 210 నిమిషాలు.. వచ్చే మూడు నెలల వరకూ ఈ ధరలే అమలలో ఉంటాయని స్పష్టం చేసింది. ఢిల్లీ- ముంబయి నడిచే విమానం సామర్ధ్యంలోని 40 శాతం సీట్లను తక్కువ ధరకు, 50 శాతం సీట్లను రూ.6,700గా ఉండాలని సూచించారు.