అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి..40 రోజులు సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి..40 రోజులు సస్పెండ్

December 10, 2019

Ayyappa 02

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు జరుగుతున్న తరుణం ఇది. అలాంటి సమయంలో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ స్కూల్ యాజమాన్యం విచిత్రంగా ప్రవర్తించింది. 40 రోజుల పాటు పాఠశాలకు రాకూడదంటూ ప్రిన్సిపల్ ఆ విద్యార్థికి ఆంక్షలు విధించాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని డాన్ బాస్కో హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి తల్లిదండ్రులతో పాటు అయ్యప్ప స్వాములు నిసనకు దిగారు. వరుస ఘటనల నేపథ్యంలో విద్యాశాఖ వెంటనే స్పందించి స్కూలు యాజమాన్యానికి సరైన విధి విధానాలు ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  

5వ తరగతి చదువు తున్న ప్రసాద్ అనే విద్యార్థి రెండు రోజుల క్రితం అయ్యప్ప మాల వేసుకున్నాడు. మాలధారణ తర్వాత ఎప్పటిలాగే తరగతులకు హాజరయ్యాడు. అతన్ని చూసిన స్కూల్ హెడ్‌మాస్టర్ విరమణ చేసే వరకు పాఠశాలకు రావద్దని సూచించి వెళ్లగొట్టాడు.ఈ విషయం తెలిసిన అయ్యప్ప స్వాములు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. తక్షణమే ప్రసాద్ ను క్లాస్ రూమ్ లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల భువనగిరిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇండియన్ మిషన్ స్కూలు యాజమాన్యం కూడా ఓ విద్యార్థిని అనుమతించలేదు.దాంతో చాలా రోజులుగా అతడు స్కూలుకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. విషయం తెలిసిన అయ్యప్ప స్వాములు స్కూలు ముందు ధర్నా చేపట్టి హెడ్‌మాస్టర్ ఛాంబర్‌లో వస్తువులు ధ్వంసం చేశారు.