వేషాలేసిన ట్రంప్.. జాడించి కొట్టిన ట్విట్టర్.. - MicTv.in - Telugu News
mictv telugu

వేషాలేసిన ట్రంప్.. జాడించి కొట్టిన ట్విట్టర్..

May 19, 2022

 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుడప్పుడు తన ఫన్నీ చేష్టలతో ప్రజలకు మంచి వినోదాన్ని అందిస్తూంటాడు. ఆ చేష్టలు ఆయనకు సీరియస్‌గా ఉన్నా.. చూసేవారికి వినోదంగా అనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటనకు ట్రంప్ పాల్పడ్డారు. ఇప్పటికే ఛీ కొట్టిన ట్విట్టర్‌తో మరోసారి ఛీ కొట్టించుకున్నారు. వివరాలు.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రజలను రాజధానిపై దాడికి ప్రేరేపించేలా ట్వీట్ చేశారంటూ 2021లో ట్విట్టర్ ట్రంప్ ఖాతాపై నిషేధం విధించింది. దాంతో తోక తొక్కిన పాములా కోపంతో ఊగిపోయిన ట్రంప్.. తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్ పేరిట ట్విట్టర్‌కు పోటీగా దింపాడు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నిరుత్సాహానికి గురైన ట్రంప్.. ఎలాగైనా ట్విట్టర్‌లో ఎంట్రీ ఇవ్వాలనుకొని దొంగచాటుగా @PresTrumpTS పేరుతో ఖాతా తెరిచాడు. ట్రూత్ సోషల్ యాప్‌లో చేసిన పోస్ట్‌లను అలాగే కాపీ కొట్టి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసేవాడు. అంతేకాక, తన పేజీని ఫాలో కావాలంటూ రిక్వెస్ట్ పెట్టాడు. కానీ, ట్రంప్ చేసిన పనిని రోజుల వ్యవధిలోనే గుర్తించిన ట్విట్టర్.. ఆయన రీఎంట్రీని రద్దు చేసి మరోసారి నిషేధం విధించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన హాఫ్ పోస్ట్ అనే మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది.