మోదీ భారత జాతిపిత..డోనాల్డ్ ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ భారత జాతిపిత..డోనాల్డ్ ట్రంప్

September 25, 2019

Trump .....

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. మంగళవారం రోజున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల కోసం భేటీ అయ్యారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ ‘భారత జాతిపిత’ అని సంచలన ప్రశంసతో ఆశ్చర్యపరిచారు. మోదీని భారత జాతిపితగా అభివర్ణించారు. మోదీ చాలా పెద్ద మనిషి అని, గొప్ప నాయకుడని పేర్కొన్నాడు. 

మోదీ అంటే తనకెంతో గౌరవమన్నారు. అసమ్మతితో, అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన భారత దేశాన్ని మోదీ ఏకం చేశారని, ఓ తండ్రిలా ఆయన అందరినీ దరిచేర్చారని ప్రశంసించారు. ఇక నుంచి ఆయనను తాము భారత జాతిపితగా పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రముఖ పాప్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీకి ఉన్నంత ప్రజాదరణ మోదీకి ఉందంటూ ఆకాశానికెత్తేశారు. కశ్మీర్ అంశం విషయంలో మోదీ, ఇమ్రాన్ కలిసి ఏదో ఒకటి తేల్చుకుంటారని నమ్ముతున్నామని తెలిపారు.