నా దేవుడు వచ్చిండు.. జనగామ వాసి ‘ట్రంప్’ సంబురం - MicTv.in - Telugu News
mictv telugu

నా దేవుడు వచ్చిండు.. జనగామ వాసి ‘ట్రంప్’ సంబురం

February 24, 2020

Donald Trump Fan In Telangana

నా దేవుడు భారతదేశానికి వచ్చినందున నేను గర్వపడుతున్నాను అంటూ తెలంగాణకు చెందిన ట్రంప్ వీరాభిమాని వ్యాఖ్యానించాడు. తాను ట్రంప్‌ను దేవుడిగా ఆరాధిస్తున్నానని త్వరలోనే ఆయనను కలుస్తానంటూ కృష్ణ ధీమాగా చెబుతున్నాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారన్నాడు. 

జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణ ట్రంప్‌కు వీరాభిమాని.  ఆయన కోసం ఏకంగా తన ఊరిలో గుడి కట్టించి పూజలు కూడా చేస్తున్నాడు. ప్రతి ఏటా ట్రంప్ జన్మదిన వేడుకలు జరుపుతున్నాడు. భారత పర్యటన సందర్భంగా అతడు ఉంటున్న ఊరు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ట్రంప్ కోసం గుడి కట్టినందుకు ఆ ఊరిని ఏకంగా ట్రంప్ విలేజ్‌గా,కృష్ణ ఇంటిని ట్రంప్ హౌస్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిని కలిసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అతడు అర్జీ కూడా పెట్టుకున్నాడు.