జీ-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

జీ-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ట్రంప్

June 2, 2020

n vbgjh b

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. జీ-7 సమ్మిట్‌కు రావాలని మోదీని, ట్రంప్ ఆహ్వానించారు. జీ7 సమ్మిట్‌లో యుఎస్, యునైటెడ్ కింగ్‌డమ్,  జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా దేశాలు ఉన్నాయి. వాతావరణ మార్పు, భద్రత, ఆర్థిక వ్యవస్థతో సహా ప్రపంచ పాలనా సమస్యలపై చర్చించడానికి ఈ దేశాల రాష్ట్రాల అధిపతులు ఏటా సమావేశం అవుతారు. ఈ క్రమంలో ఫోన్‌లో ఇరువురూ పలు అంశాల మీద మాట్లాడుకున్నారు. ‌

అమెరికాలో నల్ల జాతీయుల ఆందోళన, ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఇండియా, చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై కూడా చర్చించుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో తేవాల్సిన సంస్కరణలు, సవరణలపై కూడా ట్రంప్, మోడీ అభిప్రాయాలు పంచుకున్నారు. కాగా, భారత్‌, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను జీ 7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రణాళికపై చైనా మంగళవారం ఘాటుగా స్పందించింది. తమకు వ్యతిరేకంగా ఏ ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతాయని , జనాధరణ పొందలేవు అని తెలిపింది.