అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన సంచనల వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్షా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకడంతో ప్రచారంలో వెనుకబడ్డారు. దీంతో ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రత్యర్థి జో బిడెన్ పై డోనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. తాను తాజకీయ నాయకుడినే కాదని, ఆ పదం అంటే తనకు ఏ మాత్రం నచ్చదన్నారు. తనకు ఇంకా వయసు అయిపోలేదని, తనలో శక్తి తగ్గిపోలేదన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ముద్దుపెట్టుకోవాలని ఉందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆ సభలో ఉన్న ప్రజలు అవాక్కయ్యారు.