భారత్‌పై ట్రంప్ ప్రశంసలు.. గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌పై ట్రంప్ ప్రశంసలు.. గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారంటూ..

May 16, 2020

.kjdfgh

అగ్రరాజ్య అధిపతి డొనాల్ ట్రంప్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. చాలా గొప్పదేశం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. కంటికి కనిపించని కరోనా వైరస్‌తో పోరాడటానికి భారత్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. అక్కడ గొప్పశాస్త్రవేత్తలు ఉన్నారని, వారితో అమెరికా కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా భారత్‌కు అమెరికా అదించే సాయంపై కూడా స్పష్టం చేశారు. ‘భారత్‌లో నాకు మంచి మిత్రుడు ఉన్నారు. మా మిత్రదేశానికి అవసరమైన వెంటిలేటర్లు అందిస్తాం. కనిపించని శత్రువును ఉమ్మడిగా ఓడిస్తాం. భారత్, మోదీకి మద్దతుగా నిలుస్తాం’. అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వెంటిలేటర్ల సాయం అందిస్తామని ట్రంప్ పేర్కొనడం ఊరట కలిగించే విషయంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.