హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వండి ప్లీజ్..మోదీని కోరిన ట్రంప్‌ - MicTv.in - Telugu News
mictv telugu

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వండి ప్లీజ్..మోదీని కోరిన ట్రంప్‌

April 5, 2020

Donald Trump Requests PM Modi To Release Anti-Malarial Drug

కరోనా వైరస్ ప్రభావానికి అగ్రరాజ్యం అమెరికా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 3,11,357 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,438 మంది మృత్యువాతపడ్డారు.

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుల్ని తమ దేశానికి ఎగుమతి చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. ‘నేను ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తయారు చేస్తున్నారు. అమెరికా కోరిన మేరకు ఔషధాల్ని అందించాలని కోరాం. భారత్‌ దీన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది’ అని ట్రంప్‌ మీడియాతో అన్నారు. మార్చి 25న భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.