ట్రంప్ లింగమార్పిడి చేయించుకున్నాడా? - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ లింగమార్పిడి చేయించుకున్నాడా?

April 25, 2018

ఈ ఫొటోను చూశాక అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న ఇది! మనుషుల మధ్య పోలికలు ఉండడం సహజమే. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్పుకోవడం మనకు తెలసిందే. అయితే అచ్చం ట్రంపు అచ్చుపోసినట్లు ఈ మహిళ నెటిజన్లకు షాకులిస్తోంది. స్పెయిన్‌కు చెందిన ఈ మహిళా రైతు పేరు డొలరస్ లెయిస్ ఆంటెలో. ఇదివరకు ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల ఒకతనికి ఆమెలో ట్రంప్ దర్శనమివ్వడంతో ఓవర్ నైట్ స్టారైపోయింది.

ఆంటెలో పొలంలో పనిచేస్తున్న, గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. ముక్కు, ముఖం, తలకట్టు ముమ్మూర్తులా ట్రంప్‌ను పోలి ఉండడంతో జోకులు పేలుతున్నాయి. ‘డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ ది కోస్టా డా మోర్టె’గా అని కొనియాడుతున్నారు. ఈమె ట్రంపుకు అక్కో చెల్లో కావొచ్చని, అతని వాగుడు భరించలేక చిన్నప్పుడే స్పెయిన్‌కు పారిపోయిందని ఒకరు కామెంట్ చేశారు. ‌ఈ ఆడ ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందని అని మరొకరు అన్నారు.