Donald Trump Twitter Account Restored
mictv telugu

మస్క్ రమ్మంటున్నాడు..ట్రంప్ పొమ్మంటున్నాడు

November 20, 2022

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా మరోసారి ట్విట్టర్‌లో కనిపించడం ప్రారంభించింది. రెండు సంవత్సరాలుగా కనిపించని ట్రంప్ ట్విట్టర్ ఇప్పుడు దర్శనమిస్తోంది. ప్రజల కోరిక మేరకు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు.ట్విట్టర్ లో ట్రంప్ తిరిగి రావడానికి సంబంధించి మస్క్ పోలింగ్ నిర్వహించగా.. ఈ పోల్‌లో ఎక్కువ మంది ట్రంప్ రావాలని ఓటు వేశారు. దాంతో, ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు మస్క్ తెలిపారు.

2020 అధ్యక్ష ఫలితాలను వ్యతిరేకిస్తూ గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. ఆ సమయంలో క్యాపిటల్​ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. విధ్వంసం సృష్టించడం సంలనమైంది. వారిని ట్రంప్ రెచ్చగొట్టాడంతోనే గొడవకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ట్రంప్ ఖాతాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ బ్లాక్ చేశాయి.

మస్క్ ట్విట్టర్ పగ్గాలు అందుకున్న వెంటనే ట్రంప్ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను పునరుద్ధరించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.ఈ క్రమంలో ట్రంప్ తిరిగి ట్విట్టర్ లోకి తిరిగా రావాలా వద్దా అని ఓ పోల్ నిర్వహించారు. ఈ పోల్ లో ట్రంప్ ట్విట్టర్ లోకి రావాలని 51.8 శాతం మంది ఓట్లు వేశారు. దీంతో ట్రంప్ ఖాతా పునరుద్ధరణకు ఎలాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమయంలో ఎలోన్ మస్క్ ఒక లాటిన్ వాక్యాన్ని రాశాడు. ‘ప్రజల స్వరం, దేవుని స్వరం’.అని ట్వీట్ చేశారు.

అయితే ఖాతాను పురుద్ధరణ చేసిన తాను మాత్రం ట్విట్టర్‌లోకి రానంటూ ట్రంప్ బాంబ్ పేల్చాడు. ట్విట్టర్‌లోకి తిరిగి రావడానికి ఆసక్తి లేదని ప్రకటించాడు. తన సొంత మీడియా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని, ఇది ట్విట్టర్ కంటే మెరుగైన యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను కలిగి ఉందని, అద్భుతంగాపనిచేస్తోందని పేర్కొన్నారు.